ఏపీ కృష్ణా జిల్లా గుడివాడ రెండో పట్టణ ఎస్సై పిల్లి విజయ్ కుమార్.. తన అపార్ట్మెంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయ్‌కుమార్‌కు మూడు నెలల క్రితమే వివాహమయ్యింది. సమాచారం అందుకున్న సహచర సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు.
వివాహేతర సంబంధమే కారణమా?
విజయ్ కుమార్ మృతికి వివాహేతర సంబంధమే కారణమని సహచ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏలూరుకు చెందిన విజయ్ కుమార్ 2021 బ్యాచ్ ఎస్సైగా హనుమాన్ జంక్షన్లో మెుదటగా బాధ్యతలు చేపట్టారు. నూజివీడుకు చెందిన బ్యూటీషియన్‌తో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలతో.. విజయ్ కుమార్ అప్పట్లో సస్పెండ్ అయ్యారు.
సస్పెన్షన్ ఎత్తివేసిన తరువాత విజయ్ కుమార్.. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం ఏలూరుకు చెందిన మహిళతో విజయ్ కుమార్‌కు వివాహం జరిగింది. అయినప్పటికీ భార్యను కాపురానికి తీసుకురాకుండా.. బ్యూటీషియన్‌తో కలిసి ఆయన ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు.
బ్యూటీషియన్ ఒత్తిడి వల్లే విజయ్ కుమార్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విజయ్ కుమార్ మృతదేహాన్ని గుడివాడ ప్రభత్వ ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:పటాన్చెరు పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంపై సీబీఐ సోదాలు