ప్రమాదవశాత్తు చెరువులో మునిగి తాతా మనుమడు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహామత్తారం మండలం బోర్లగూడెం గ్రామంలో జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు జాలర్ల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విలపించిన తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది.
విషాదం: చెరువులో మునిగి తాతా మనుమడు మృతి - చెరువులో మునిగి తాతా మనుమడు మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహామత్తారం మండలం బోర్లగూడెం గ్రామంలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తాతా మనుమడు మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు జాలర్ల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.
జిల్లాలోని బోర్లగూడెం గ్రామానికి చెందిన భీమయ్య (60) గత 25 ఏళ్లుగా చేపల చెరువుకు కాపలాగా ఉంటున్నాడు. ఆదివారం మనుమడు రిషి (10)తో కలిసి చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో నీటిలో ఆడుకుంటున్న రిషి మునిగి పోవడంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో భీమయ్య కూడా నీట మునిగి చనిపోయాడు. గత నెలలో జేసీబీతో మట్టి తీయడం కారణంగా ఏర్పడ్డ గుంతల్లో చిక్కుకునే వారిద్దరూ మృతిచెంది ఉంటారని స్థానికులు తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ మహాముత్తారం మండల అధ్యక్షుడు భాస్కరాచారి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు... 13 మంది అరెస్ట్