తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఒకే చున్నీకి ఉరేసుకుని ప్రేమికుల బలవన్మరణం! - padarupalli lovers suicide news

ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసే జీవితాంతం బతికాలని ఆశపడ్డారు. విధి వారిద్దరినీ విడదీసింది. వారి ఆశలను సమాధి చేసింది. తప్పక.. ఇటీవలే ఇద్దరూ వేరేవాళ్లను మనువాడారు. పెళ్లి పీఠలైతే ఎక్కారు.. కానీ వేరేవాళ్లతో జీవితాన్ని పంచుకోలేకపోయారు. పెళ్లి కలవలేకపోయిన వాళ్లు చావుతో ఒక్కటవ్వాలి అనుకున్నారు. ఒకే చున్నీకి కలిసి ఉరేసుకున్నారు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్​లోని పడారుపల్లిలో జరిగింది.

ఒకే చున్నీకి ఉరేసుకుని ప్రేమికుల బలవన్మరణం!

By

Published : Jan 30, 2021, 2:26 PM IST

నెల్లూరు జిల్లా పడారుపల్లిలో ఉన్న ఓ హోటల్‌లో శుక్రవారం అర్థరాత్రి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను చిట్టమూరు మండలం మెట్టు సచివాలయంలో పనిచేస్తున్న వీఆర్‌వో లావణ్య, డిజిటల్‌ అసిస్టెంట్ హరీశ్‌లుగా గుర్తించారు.

ప్రేమ వ్యవహారమే.. ఆత్మహత్య కారణమనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరు ఆత్మహత్య చేసుకున్న గదిలో "దయచేసి మమ్మల్ని క్షమించండి. మా అవయవాలను దానం చేయండి" అని రాసి ఉన్న లెటర్‌ దొరికింది.

దీంతో వీళ్ల ప్రేమ విఫలమైనందున ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ప్రాథమిక పరిశీలనలో తెలుస్తోంది. వీరిద్దరికీ వేర్వేరుగా ఇటీవలే వివాహం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:చెరువులో మృతదేహం.. ప్రమాదమా?.. హత్యా!

ABOUT THE AUTHOR

...view details