తెలంగాణ

telangana

ETV Bharat / crime

Govt Teacher Died: గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి.. బదిలీ ఆందోళనతోనేనా..?

Govt Teacher Died: దూర ప్రాంతాలకు బదిలీ అయ్యి... ఆవేదనతో చనిపోతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 317 జీవోను బలంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు... అటు విధుల్లో చేరి ఉద్యోగాలు చేయలేక తనువు చాలిస్తున్నారు. ఆదివారం మరో ఉపాధ్యాయురాలు.. గుండెపోటుతో మరణించింది.

Government Teacher Died with heart attack in newshayampet
Government Teacher Died with heart attack in newshayampet

By

Published : Jan 10, 2022, 5:21 AM IST

Govt Teacher Died: అకస్మాత్తుగా ఛాతిలో మంట.. కడుపు, గుండెలో నొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉపాధ్యాయురాలు మృతి చెందింది. హనుమకొండలోని న్యూశాయంపేటలో ఈ విషాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం యర్జర్ల శివారు పూసల తండాలోని ప్రాథమిక పాఠశాలలో 2010 నుంచి శ్రీమతి.. ఉపాద్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తోంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన బదిలీల ప్రక్రియలో శ్రీమతి.. ఏటూరునాగారం సమీపంలోని రొయ్యూరు పాఠశాలకు బదిలీ అయ్యింది.

ఉపాధ్యాయురాలు శ్రీమతి

పాఠశాలలో విధుల్లో చేరి తిరిగి ఇంటికి చేరుకుంది. రాత్రి సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు సమీపంలోని వాసవి హాస్పిటల్​కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో అజార్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఛాతిలో నీరు పేరుకుందని, గుండె వేగం పెరిగిందని వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ శ్రీమతి.. ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది.

జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న వీరు సుదూర ప్రాంతానికి బదిలీకావడంతో శ్రీమతి... మనస్థాపంతో అస్వస్థతకు గురై ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి. శ్రీమతి మృతితో పూసల తండాలో విషాదం నిండింది. ఆమె స్వగ్రామం వెంకటాపురం మండలం నల్లగుంటలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details