ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారిపడి కల్లుగీత కార్మికుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వెంపటి గ్రామంలో జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి - కల్లు గీత కార్మికుడు మృతి
కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కిన ఓ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు అక్కడి నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలోని వెంపటి గ్రామంలో జరిగింది.
కల్లు గీత కార్మికుడు మృతి
జిల్లాలోని వెంపటి గ్రామానికి చెందిన తునికి కుమార్ గౌడ్ (52) రోజూలాగే ఉదయం కల్లు గీయడానికి తాటి చెట్టుపైకి ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తుంగతుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.