తెలంగాణ

telangana

ETV Bharat / crime

Gold Seized: హ్యాండ్​ బ్యాగ్​లో రింగుల బంగారం.. ఎయిర్​పోర్టులో సీజ్ - Gold Seized News

Gold Seized: శంషాబాద్​ విమానాశ్రయంలో కువైట్ నుంచి శంషాబాద్ చేరుకున్న ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించాడు. ఎయిర్​పోర్టు అధికారులు అతడిని తనిఖీ చేయగా... రింగుల రూపంలో అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చినట్లు గుర్తించారు.

Gold
Gold

By

Published : May 12, 2022, 7:26 PM IST

Gold Seized: విదేశాల నుంచి అక్రమంగా బంగారం రవాణా చేసిన ప్రయాణికుడిని శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. కువైట్‌ నుంచి శంషాబాద్‌ చేరుకున్న ఓ ప్రయాణికుడి కదలికలు అనుమానస్పదంగా ఉండడంతో అతన్ని అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో రేడియం పూతతో హ్యాండ్‌ బ్యాగ్​లో రింగుల రూపంలో అక్రమంగా బంగారాన్ని తీసుకువచ్చినట్టు బయటపడింది. ప్రయాణికుడి వద్ద నుంచి 29.15 లక్షల రూపాయల విలువైన 551.21 గ్రాముల బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ మధ్యకాలంలో తరుచుగా శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడుతోంది. ఎలాగైనా సరే అక్రమంగా తరలించాలనే దురుద్దేశంతో ఇతర దేశాల నుంచి బయల్దేరి ఇక్కడ దొరికిపోతున్నారు. ఇటీవలే శంషాబాద్‌ ఎయిర్​పోర్టులో ఒకటిన్నర కిలోకుపైగా విదేశీ అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల లగేజి తనిఖీ చేయగా అక్రమ బంగారం గుట్టురట్టయింది. రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు... వారి నుంచి రూ.89.74 లక్షలు విలువ చేసే 1,680 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details