ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ... విన్యాసాలు చేస్తున్న ఓ వ్యక్తిని గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిత్యం రద్దీగా ఉండే మెహదీపట్నం, టోలీ చౌకీ ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ద్విచక్ర వాహనంపై ప్రమాదకర ఫీట్లు.. అరెస్ట్ చేసిన పోలీసులు - telangana news
నగర రోడ్లపై ఆకతాయిల ఆగడాలు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. రద్దీగా ఉండే రహదారులపై ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ.. వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతూ.. విన్యాసాలు చేస్తున్న ఓ వ్యక్తిని గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
ద్విచక్ర వాహనంపై ప్రమాదకర ఫీట్లు.. అరెస్ట్ చేసిన పోలీసులు
రద్దీగా ఉండే రహదారులపై ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.
ఇదీ చదవండి:ప్రత్యర్థులు కూడా అభినందించాల్సిందే: కేటీఆర్