బతుకుదెరువుకు నగరానికి వచ్చిన దంపతులకు పుట్టెడు దుఃఖమే మిగిలింది. చీరతో కట్టిన ఊయలలో ఊగుతున్న చిన్నారికి.. ఆ ఊయలే మృత్యు పాశమై ప్రాణం తీసింది. ఇంట్లో సరదాగా ఆడుకునే ఊయలతాడే ఓ చిన్నారి పాలిట యమపాశంగా మారింది. చీరతో ఆడుకుంటున్న బాలికకు ప్రమాదశాత్తు ఆ చీర మెడకు చుట్టుకొని బిగుసుకు పోయి ఊపిరాడకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లాలాపేటకు చెందిన కోట ఎలీనా (09) శనివారం తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో మధ్యాహ్నం సమయంలో తన చెల్లెలితో కలిసి ఇంట్లో ఆడుకుంటుంది. మెడకు చీర కట్టుకొని గోడకు ఉన్న మేకుకు కట్టుకుంది. ఈ క్రమంలో అది ఒక్కసారిగా గొంతుకు బిగుసుకుపోవడంతో ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరై చనిపోయింది.
సరదాగా ఆడుకునే ఊయలే ఉరితాడైంది..! - telangana varthalu
అమ్మ చీరతో ఇంట్లో కొక్కానికి ఊయల కట్టింది. ఆనందంగా ఊగుదామని ఆ చిన్నారి భావించింది. కొద్దిసేపు కేరింతలు కొడుతూ ఊగింది. ఊయలలో గిరగిరా తిరిగింది. చివరికి ఆ ఊయలే ఆ పాప పాలిట ఉరితాడైంది. చీరెలో ఇరుక్కుని ఊపిరి ఆడక మృతి చెందింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
లాలాగూడ ఎస్సై రవీందర్ వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడంకు చెందిన ప్రసన్నజ్యోతి, రాజేష్ దంపతులు లాలాపేటలో ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. రాజేశ్ డ్రైవర్‌గా పని చేస్తుండగా.. భార్య కూలీ పనులకు వెళుతుంది. శనివారం తల్లి పనికి వెళ్లగా పెద్ద కుమార్తె ఎలీనా(9) తన చెల్లెళ్లతో కలిసి ఆడుకుంటోంది. ఇంట్లో కొక్కానికి తల్లిచీరతో కట్టిన ఊయలలో ఊగుతుండగా ఆ చీర ఎలీనా మెడకు చుట్టుకొని బిగుసుకుపోవటంతో ఊపిరాడక మృతి చెందింది. తన అక్క మాట్లాడటం లేదని గమనించిన పెద్ద చెల్లెలు.. సమీపంలో ఉన్న బంధువులకు చెప్పడంతో విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: