మాదకద్రవ్యాలను అరికట్టడానికి ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో చోట గంజాయి సాగు ఉదంతాలు బయటపడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి వచ్చిన కార్మికులు గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల వద్ద గంజాయి పెంపకం... - తెలంగాణ తాజా నేర వార్తలు
ఒకప్పుడు పంట పొల్లాలో గుట్టుగా సాగు చేసే గంజాయి పట్టణాలకు విస్తరించింది. దానికి బానిసలైన వారు కొత్త దారులు తొక్కుతున్నారు. ఇళ్లలో పూల చెట్లు పెంచినట్టుగా గంజాయిని సాగు చేస్తున్నారు. చివరకు ఈ విషయం బయటపడటంతో వాటిని తొలగిస్తున్న వీడియోలు కామారెడ్డి జిల్లాలో వైరల్గా మారాయి.
తొలగించిన గంజాయి
ఈ విషయం కాస్త బయటకు తెలియడంతో వారు వాటిని తొలగించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుండంతో పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:12 ఏళ్ల బాలున్ని చంపిన మైనర్.. ఎందుకు చంపాడో తెలిస్తే షాక్..!