తెలంగాణ

telangana

ETV Bharat / crime

పశువులను మేపడానికి వెళ్లి.. పిడుగుపాటుకు నలుగురి మృతి - పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుకు నలుగురి మృతి

Four people died: ఏపీలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పిడుగులు పడి ఒకేరోజు నలుగురు మృత్యువాత పడ్డారు.

Four people
పిడుగుపాటుకు నలుగురి మృతి

By

Published : Aug 2, 2022, 1:37 PM IST

Four people died: ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామంలో జడ రామాంజమ్మ (33), పోతిరెడ్డి పిచ్చిరెడ్డి (54), ఆలకుంట చిన్న రాములు (60) గేదెలను మేపుకోవటానికి ప్రతిరోజు మాదిరిగానే సమీపంలోని పొలాలకు వెళ్లారు. సాయంత్రం తిరిగివస్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.

పొలాల్లోని గట్లపై ఉన్న సమయంలో భారీ పిడుగుపడి అక్కడికక్కడే ముగ్గురూ మృతిచెందారు. అలాగే పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలోని మతుకుమల్లిలో శివాది అంజయ్య (60) పశువులను మేపడానికి పొలానికి వెళ్లి భారీ వర్షంలో ఇంటికి తిరిగి వస్తూ పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details