సరిహద్దు జిల్లాల నుంచి.. ఆంధ్రప్రదేశ్‌కు మద్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం పంచలింగాల వద్ద... స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో కారును ఆపకుండా ఓ డ్రైవర్ తప్పించుకుని ముందుకు వెళ్లాడు.
ఆంధ్రాకు అక్రమ మద్యం.. పోలీసుల స్వాధీనం - మద్యం తరలింపు
నాలుగు లక్షల విలువైన మద్యాన్ని ఏపీకి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలో చోటు చేసుకుంది. మద్యం అక్రమ రవాణా చేస్తే నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
అక్రమంగా తరలిస్తున్న వైనం... 4 లక్షల విలువైన మద్యం స్వాధీనం
అప్రమత్తమైన అధికారులు... వాహనాన్ని వెంబడించారు. అదుపుతప్పిన కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లగా... డ్రైవర్ అక్కడ నుంచి పరారీ అయ్యాడు. అధికారులు నాలుగు లక్షలు విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం చట్టాలను మరింత కఠినతరం చేశామని... అక్రమ రవాణా చేస్తే నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఈబీ అధికారి లక్ష్మి దుర్గయ్య తెలిపారు.
ఇదీ చూడండి:జక్లేర్‌లో నిషేధిత గుట్కా పట్టివేత!
Last Updated : Jan 23, 2021, 1:05 AM IST