ఖమ్మం నగరంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గాయపడ్డారు. సుగ్గులవారి తోట కాలనీకి చెందిన హస్సేన్ భార్య సల్మా మంగళవారం రాత్రి.. నిద్రపోయే సమయంలో గ్యాస్ సిలిండర్ బంద్ చేయకుండా నిద్రపోయారు. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత గ్యాస్ పొయ్యిని అంటించగా.. సిలిండర్ పేలి ఇంట్లో మంటలు ఎగసిపడ్డాయి.
ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలు
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలు
దంపతులతో పాటు... ఇద్దరు పిల్లలు నాజియా, ముజాయిద్ గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయాయి. బంధువులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి ఇద్దరు పిల్లలకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇంటి యజమాని హస్సేన్కు తీవ్ర గాయాలవడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
- ఇదీ చదవండి:తప్పుల తడకగా అదనపు మార్కులు