కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించిన ఘటన యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శవాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం - గుర్తు తెలియని మృతదేహం
యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని ఓ వ్యవసాయన బావిలో.. కుళ్లిపోయిన ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
decomposed dead body
గత జనవరిలో.. గ్రామానికి చెందిన నర్సయ్య (48) అనే వ్యక్తి తప్పిపోయినట్లు పీఎస్లో ఓ కేసు నమోదై ఉందని ఎస్ఐ రాఘవేందర్ గుర్తు చేశారు. ఆ కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి:మన్యంలో ఘోరం: మూగ బాలికపై సామూహిక అత్యాచారం!