వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం మామునూరు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో విషాదం చోటుచేసుంది. వంట చేస్తుండగా తేనెటీగల దాడిలో ఓ పూర్వ విద్యార్థి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మామునూరు టీఎస్‌ఎస్పీ నాలుగో బెటాలియన్‌లోని జడ్పీహెచ్‌ఎస్ 2000-01 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు.
విద్యార్థుల పూర్వ సమ్మేళనం.. ఓ వ్యక్తి మృతి - mamnoor crime news
వారంతా ఒకప్పుడు కలసి ఒకే స్కూల్లో చదువుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారు. చిన్ననాటి మిత్రులతో ఓ చక్కటి కార్యక్రమం నిర్వహించి సరదాగా గడపాలనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. పూర్వ సమ్మేళనంలో భాగంగా కందిరీగల దాడితో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది.
ఆ బ్యాచ్‌కు చెందిన 60 మంది విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో భోజనాలు వండేందుకని కట్టెల పొయ్యి వెలిగించగా సమీపంలోని చెట్టుపై ఉన్న తేనెటీగలు వారిపై దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ఖిలా వరంగల్ పడమరకోటకు చెందిన మైదం దయాకర్ (35)కు తీవ్ర గాయాలు కావడం వల్ల... వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. ఉపాధ్యాయుడు వెంకటరామయ్య, విద్యార్థులు సతీష్, సురేష్‌లు బెటాలియన్ యూనిట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
ఇదీ చూడండి :దైవదర్శనానికి వెళ్లి దంపతులు మృతి