హైదరాబాద్‌లో పంజాగుట్ట పీఎస్ పరిధిలో సుమారు నాలుగేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. స్థానిక ద్వారకపురి కాలనీలో ఓ దుకాణం ముందు బాలిక మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవపరీక్ష కోసం బాలిక మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
పంజాగుట్టలో నాలుగేళ్ల బాలిక మృతదేహం... మరణమా? లేక హత్యా? - బాలిక మృతదేహం గుర్తింపు
12:00 November 04
నాలుగేళ్ల బాలిక మృతదేహం గుర్తించిన స్థానికులు
అయితే చిన్నారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. బాలికది సహజ మరణమా? లేక ఎక్కడైనా చంపేసి ఇక్కడ పడేసి వెళ్లారా? అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఓ దుకాణం ముందు పాప మృతదేహం ఉండటంతో ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు బాలికకు సంబంధించి ఎవరూ పోలీసులను ఆశ్రయించలేదు. చుట్టుపక్కల పీఎస్‌లలో మిస్సింగ్ కేసులేమైనా నమోదయ్యాయా అని పంజాగుట్ట పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి:'అమ్మా నన్ను క్షమించు.. నీ గుడిలో దొంగతనం చేసినందుకు'
Road accident: బంధువులకు వీడ్కోలు చెప్పి వస్తుండగా ప్రమాదం.. చిన్నారి మృతి
Fire accident: చెప్పుల కార్ఖానాలో అగ్ని ప్రమాదం.. రూ. 8 లక్షల ఆస్తి నష్టం.!