హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం.. గోల్డ్‌షాప్‌లో చోరీ - హైదరాబాద్ నేర వార్తలు
22:03 December 01
హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం.. గోల్డ్‌షాప్‌లో చోరీ
హైదరాబాద్ నగరంలోని నాగోల్ స్నేహపురి కాలనీలో కాల్పులు కలకలం రేపాయి. నాగోల్‌లోని మహదేవ్ జువెల్లర్స్‌లోకి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఒక్కసారిగా దుకాణంలోని యజమానిపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో దుకాణ యజమానికి, వర్కర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం దుండగులు యజమానిని బెదిరించి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గాయపడిన దుకాణ యజమాని కల్యాణ్, వర్కర్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. నిందితులను కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: