FIRE IN PRAIVATE BUS: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని అంగడి బజార్ సమీపంలో ఆగి ఉన్న బస్‌లో మంటలు చెలరేగాయి. బస్సులో మంటలు వ్యాపించడం చూసిన స్థానికులు ఆర్పి వేసే ప్రయత్నం చేశారు. వాళ్ల శ్రమతో.. మంటలు మరింత వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. సమాచారం అందుకొని ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. దీని వల్ల బస్సు పూర్తిగా దగ్ధం కాకుండా నివారించినట్టైంది. ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవటం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎండ వేడిమి కారణంగానే మంటలు వ్యాపించాయని స్థానికులు భావిస్తున్నారు.
ఆగి ఉన్న ప్రైవేట్ బస్సులో పొగ.. చూస్తున్నంతలోనే.. - బస్సులో చెలరేగిన మంటలు
FIRE IN PRAIVATE BUS: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అంగడిబజార్ రోడ్డులో పార్కింగ్‌లో నిలిపి ఉంచిన ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో మంటలు వ్యాపించడం చూసిన స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
FIRE IN PRAIVATE BUS