జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం(fire accident report) జరిగింది. కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు సిబ్బంది ఉదయం రాగా... మంటలు వ్యాపిస్తుండడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. రికార్డు గది తెరచి చూడగా స్వల్పంగా మంటలు వ్యాపించడం గమనించి.. తహసీల్దారు, పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడే ఉన్న ఉద్యోగులు, స్థానికులు మంటలను(fire accident report) అదుపు చేసేందుకు యత్నించారు.
fire accident report: తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. రికార్డుల గదిలో భారీగా మంటలు - తెలంగాణ వార్తలు
10:15 October 25
తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి వచ్చి మంటలను అదుపు చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ వరలక్ష్మి వెంటనే కార్యాలయానికి వచ్చి పరిశీలించారు. ఈ ప్రమాదంలో రికార్డు గదిలోని ఉద్యోగులు, భూములకు సంబంధించిన రికార్డులు, రిజిస్ట్రేషన్ ఫైల్స్ దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు(fire accident report) వ్యాపించి ఉంటాయని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీనిపై విచారణ చేయాల్సిందిగా ఆర్డీవో రాములు సంబంధిత అధికారులను ఆదేశించారు.
కార్యాలయం మరమ్మతుల కోసం తహసీల్దార్ వరలక్ష్మి రూ.నాలుగు లక్షల మంజూరు చేయాలని ఇటీవలె ప్రతిపాదనలు పంపారు. అంతలోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.
ఇదీ చదవండి:Car hits Divider : డివైడర్ను ఢీకొన్న కారు.. మృతుల్లో సైబర్ క్రైమ్ ఏసీపీ కుటుంబసభ్యులు