షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన హైదరాబాద్ మంగళహాట్ పరిధిలోని సీతారాం బాగ్ వద్ద జరిగింది. భారీగా ఎగసిపడిన మంటల కారణంగా ఆ పక్కనే ఉన్న చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి.
షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు - షాక్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం
హైదరాబాద్లోని సీతారాం బాగ్ ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వారం రోజులుగా జీహెచ్ఎంసీ సిబ్బంది చెత్త తొలగించక లేదని అక్కడ ఎవరో సిగరెట్ వేసి ఉంటారని.. అది కాస్తా అగ్ని ప్రమాదంగా మారి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.