Fire accident in Vishal Mart: ఆంధ్రప్రదేశ్ విజయనగరం ఆర్ అండ్ బీ కూడలి వద్ద అగ్నిప్రమాదం జరిగింది. విశాల్ మార్ట్లోని మొదటి అంతస్తులో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు భారీ ఎత్తున వ్యాపించటంతో మొదటి అంతస్తులోని సరకులు పూర్తిగా కాలిపోయాయి. ఆ మంటలు రెండో అంతస్తుకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. మార్ట్ పరిసర ప్రాంతాల్లో నివాసాలను పోలీసులు ఖాళీ చేయించారు.
అయిదు గంటల నుంచి మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. మంటలార్పేందుకు విశాఖ నుంచి ప్రత్యేకమైన బ్రాంటో స్కైలిఫ్ట్ ఫైర్ ఇంజిన్ తెప్పించారు. మరో 2 గంటల్లో మంటలార్పుతామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న కలెక్టర్ సూర్యకుమారి, ఎస్పీ దీపికా పాటిల్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. నెల వ్యవధిలో విశాల్ మార్ట్‌లో రెండోసారి అగ్నిప్రమాదం సంభవించింది.