Fire Accident: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ప్రింటింగ్, ప్యాకేజింగ్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. గాంధీనగర్‌లోని కార్యాలయంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగటంతో ఫర్నిచర్‌కు అంటుకొని కంప్యూటర్లు, కీలక పత్రాలు కాలిపోయాయి. షిఫ్ట్ టైమ్ అయిపోవడంతో వర్కర్స్ అందరూ ఇళ్ళకుపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Fire Accident: జీడిమెట్లలో అగ్నిప్రమాదం.. కంప్యూటర్లు, ఫర్నీచర్ దగ్ధం - ప్యాకేజింగ్ కంపెనీ కార్యాలయంలో అగ్నిప్రమాదం
Fire Accident: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధి గాంధీనగర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పారిశ్రామికవాడలోని ప్రింటింగ్, ప్యాకేజింగ్ కంపెనీ కార్యాలయంలో ఫర్నీచర్ దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు.
గాంధీనగర్‌లో అగ్నిప్రమాదం
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని కంపెనీ యజమాని రంగారావు తెలిపారు.
- ఇదీ చూడండి:
- నిప్పు నిదానంగా రాజుకుందా?.. బోయిగూడ అగ్నిప్రమాదంపై పోలీసుల పరిశోధన