తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్లాస్టిక్ దుకాణంలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం - మేడ్చెల్ జిల్లాలో అగ్ని ప్రమాదం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ ప్రాంతంలోని గండిమైసమ్మ చౌరస్తా పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ప్లాస్టిక్ విక్రయించే దుకాణంలో అగ్ని ప్రమాదం
fire accident in plastic shop

By

Published : Jun 4, 2021, 7:10 PM IST

షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుందిగల్ ప్రాంతంలోని గండిమైసమ్మ చౌరస్తా పరిధిలో జరిగింది.

ఈ రోజు మధ్యాహ్నం వరకు దుకాణాన్ని తెరిచి ఉంచిన యజమాని లాక్​డౌన్ కారణంగా ఒంటిగంట సమయంలో షాప్​ మూసేని ఇంటికెళ్లాడు. తాళం వేసి ఉన్న దుకాణంలో నుంచి స్వల్పంగా పొగ రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. సుమారు రూ.20 లక్షల విలువైన ప్లాస్టిక్ సామగ్రి మంటల్లో కాలిపోయిందని షాప్​ యజమాని వాపోయాడు.

ఇదీ చదవండి:ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

ABOUT THE AUTHOR

...view details