తెలంగాణ

telangana

ETV Bharat / crime

Fire accident: ఇనుప సామగ్రి దుకాణంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు - telangana varthalu

ప్రమాదవశాత్తు పాత ఇనుప సామాన్ల విక్రయ కేంద్రంలో నిప్పు అంటుకుని మంటలు చెలరేగిన ఘటన నారాయణపేట జిల్లా మరికల్​ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సమీపంలోని వ్యాపార దుకాణాలకు మంటలు వ్యాపించడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

Fire accident: ఇనుప సామగ్రి దుకాణంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
Fire accident: ఇనుప సామగ్రి దుకాణంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

By

Published : Oct 16, 2021, 10:09 PM IST

నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని ఓ పాత ఇనుప సామాన్ల విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. 167 వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ దుకాణంలో నిప్పు అంటుకుని భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. మంటలు భారీ స్థాయిలో చెలరేగడంతో విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అగ్నికీలలు ఎగిసిపడుతుండడంతో పక్కనే ఉన్న మరో దుకాణానికి మంటలు వ్యాపించాయి. దీనితో సమీపంలోని దుకాణాల యజమానులు ఆందోళన చెందుతున్నారు.

దుకాణం సమీపంలోనే ఉన్న 2 పెట్రోల్‌ బంకులు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయాలని కోరుతున్నారు. స్థానికులు సమాచారం ఇచ్చినా ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది రాలేదని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యుత్​ సరఫరా నిలిచిపోవడంతో పట్టణం అంధకారం నెలకొంది.

ఇదీ చదవండి:RK funeral photos: ఆర్కే అంత్యక్రియలు పూర్తి.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

ABOUT THE AUTHOR

...view details