తెలంగాణ

telangana

ETV Bharat / crime

లైవ్ వీడియో: నడిరోడ్డుపై డీసీఎం వాహనం దగ్ధం - fire accident latest news

అట్టల లోడ్​తో వెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్​కు... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కమాన్​ వద్ద మంటలంటుకున్నాయి. డ్రైవర్​కు తెలియక ముందుకు వెళ్తుండగా... స్థానికులు గుర్తించి అప్రమత్తం చేశారు.

డీసీఎం వ్యాన్​కు మంటలు... పూర్తిగా కాలిపోయిన లోడ్​
డీసీఎం వ్యాన్​కు మంటలు... పూర్తిగా కాలిపోయిన లోడ్​

By

Published : Feb 24, 2021, 11:23 AM IST

డీసీఎం వ్యాన్​కు మంటలు... పూర్తిగా కాలిపోయిన లోడ్​

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మారుపాక కమాన్ వద్ద అట్టల లోడ్​తో వెళ్తున్న డీసీఎం వ్యాన్​కి ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్తున్న డీసీఎం వ్యాన్​కి వేములవాడ కమాన్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మంటలను గమనించని డ్రైవర్​... అలాగే మందుకు వెళ్తుండడం వల్ల స్థానికులు అప్రమత్తం చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

అగ్నిమాపక శకటం వచ్చే సమయానికే వ్యాన్​లోని అట్టాలు పూర్తిగా కాలిపోయాయి. వ్యాన్​కు ఎలాంటి ప్రమాదం కాకుండా ఫైర్​ సిబ్బంది మంటలను ఆర్పేశారు.

ఇదీ చూడండి: కొత్త పింఛన్ల అంశంపై బడ్జెట్లో స్పష్టత...!

ABOUT THE AUTHOR

...view details