కరీంనగర్ జిల్లాలో ఓ కాంక్రీట్ మిక్సర్ వాహనం దగ్ధమైంది. మానకొండూర్ నుంచి లింగాపూర్ వెళ్తున్న కాంక్రీట్ మిక్సర్లో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ భయాందోళనకు గురై... దూకి మంటల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
విద్యుదాఘాతంతో కాంక్రీట్ మిక్సర్ దగ్ధం - తెలంగాణ వార్తలు
కరీంనగర్ జిల్లాలో కాంక్రీట్ మిక్సర్ వాహనం పూర్తిగా దగ్ధమైంది. విద్యుదాఘాతంతో వాహనంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
విద్యుదాఘాతంతో కాంక్రీట్ మిక్సర్ దగ్ధం
మంటలు ఆర్పేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల వాహనం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు ఈ ఘటనను చరవాణుల్లో చిత్రీకరించారు.
ఇదీ చదవండి:దృష్టి మళ్లించి మోసం చేసే అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్