తెలంగాణ

telangana

ETV Bharat / crime

గుట్టపై మంటలు.. భయాందోళనలో భక్తులు - telangana news

వరంగల్ గ్రామీణ జిల్లా కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి గుట్ట వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. పోలీసులు, జాతరకు వచ్చిన యువకులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ... అదుపులోకి రాలేదు.

fire accident at the back of Lakshminarasimha swamy Gutta in Warangal Rural District
గుట్టపై మంటలు.. భయాందోళనకు గురైన భక్తులు

By

Published : Mar 25, 2021, 7:15 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం శ్రీకొమ్మాల లక్ష్మీనరసింహస్వామి గుట్ట వెనుకభాగంలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. ఓ వైపు స్వామివారి కల్యాణం జరుగుతుండగా... మరోవైపు గుట్టపై మంటలు చెలరేగడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.

పోలీసులు, జాతరకు వచ్చిన యువకులు మంటలను ఆర్పేప్రయత్నం చేసినప్పటికీ... అదుపులోకి రాలేదు. దీంతో అధికారులపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ఏసీబీకి చిక్కిన మత్స్య శాఖ పర్యవేక్షణ అధికారి

ABOUT THE AUTHOR

...view details