Fire accident at Lee pharma Industry Gaddapotharam: రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివార్లలోని జిన్నారం మండలం గడ్డ పోతారం పారిశ్రామిక వాడలోని లీ ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలతో పరిశ్రమ పరిసరాల్లో మంటలు వ్యాపించాయి. భయాందోళనలతో కార్మికులు బయటకు పరుగులు తీశారు.
పరిశ్రమలోని ప్రొడక్షన్ బ్లాక్లో సాల్వెంట్ను అన్లోడ్ చేస్తుండగా నిప్పురవ్వలు చెలరేగి ఒకేసారి ట్యాంక్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రొడక్షన్ బ్లాక్లో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో పరిశ్రమలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలు, కమ్ముకున్న పొగలతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.