Fire Accident: కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం.. 600 క్వింటాళ్లకు పైగా పత్తి దగ్ధం - fire accident today
15:43 October 26
పత్తి మిల్లులో అగ్నిప్రమాదం.. 600 క్వింటాళ్లకు పైగా పత్తి దగ్ధం
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మురుగన్ పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పత్తిని హాట్బాక్స్లో డంపింగ్ చేస్తుండగా.. ఈ ఘటన సంభవించింది. అక్కడే ఉన్న వాళ్లు.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన పత్తి మిల్లుకు చేసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పుతున్నారు. అప్పటికే పత్తి చాలా వరకు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో పత్తి మిల్లులోని సుమారు 600 క్వింటాళ్లకు పైగా పత్తి దగ్ధమైనట్టు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: