ఓ బుల్లెట్ బైక్లో పెట్రోల్ నింపుతుండగా... మంటలు చెలరేగిన ఘటన... ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు లాడ్జి సెంటర్‌లో ఇండియన్ పెట్రోల్ బంక్‌లో సంభవించింది. ట్యాంక్ నిండిపోయి ఇంజన్ మీద పడి... ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైకు సగానికిపైగా మంట్లలో దగ్ధమైంది.
బుల్లెట్లో పెట్రోల్ కొడుతుండగా చెలరేగిన మంటలు - ఐవోసీ పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం
ఏపీలోని గుంటూరు లాడ్జి సెంటర్‌లో ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. బైక్‌లో పెట్రోల్ నింపుతుండగా మంటలు చెలరేగినట్లు బంక్ సిబ్బంది తెలిపారు.
బుల్లెట్లో పెట్రోల్ కొడుతుండగా చెలరేగిన మంటలు
అక్కడున్నవారిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నిత్యం రద్దీగా ఉండే లాడ్జి సెంటర్‌లో అగ్నిప్రమాదంతో స్థానికులు కంగారు పడ్డారు. మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఎస్‌ఈసీ లేఖ
Last Updated : Jan 23, 2021, 10:35 PM IST