తెలంగాణ

telangana

ETV Bharat / crime

Road accidents in Telangana today : ట్యాంక్​బండ్​లోకి దూసుకెళ్లిన కారు.. ఖమ్మంలో ఆర్టీసీ బస్సు బోల్తా - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో ఇవాళ వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు(Road accident report) జరిగాయి. వివిధ జిల్లాల్లో చోటు చేసుకున్న ఈ ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. హైదరాబాద్​లో అతివేగంగా వెళ్తున్న ఓ కారు హుస్సేన్​సాగర్​లోకి దూసుకెళ్లింది.

Road accident in telangana today, Road accident report
ఆర్టీసీ బస్సు బోల్తా.. కారు బీభత్సం..

By

Published : Nov 28, 2021, 8:36 AM IST

Telangana Road Accidents Today News: రాష్ట్రంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. వివిధ జిల్లాల్లో చోటు చేసుకున్న ఈ ప్రమాదాల్లో గాయపడిన వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

బస్సు బోల్తా

Khammam RTC Bus Accident Today: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేడ్కర్ నగర్ వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడింది. కొత్తగూడెం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తూ... రాత్రి ఒంటిగంట సమయంలో రోడ్డుపై ఉన్న గుంతలు తప్పించే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా... పది మందికి గాయాలయ్యాయి.

తప్పిన పెను ప్రమాదం

వైరా సీఐ వసంత్ కుమార్, తల్లాడ ఎస్సై సురేశ్, సర్పంచ్ కిరణ్... సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బస్సు బోల్తా పడిన తీరును చూసి పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. రహదారిపై బస్సు బోల్తా పడటంతో ఖమ్మం-రాజమండ్రి జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

కారు బీభత్సం

Road Accident in Hyderabad Today 2021: హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ ముందు కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ నుంచి అతివేగంగా వచ్చిన కారు... హుస్సేన్ సాగర్​లోకి దూసుకెళ్లింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అందులో ఉన్న ముగ్గురు యువకుల్లో ఒక వ్యక్తి చేయి విరిగిపోగా... ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.

టిఫిన్ కోసం వెళ్తుండగా..

కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు... క్షతగాత్రులను సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు ఖైరతాబాద్​కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్​గా పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితమే కొత్త కారు తీసుకున్నట్లు... ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్​లో టిఫిన్ చేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

వాహనాన్ని ఢీకొన్న కారు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ప్రమాదం జరిగింది. వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. బాధితులను నార్కట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details