తండ్రి కర్మకాండలు నిర్వహించేందుకు కుమారుడు లలిత్ సాగర్(30) వంశధార నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదశాత్తు నదిలో గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలోని సుబలయి గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఆర్ఆర్ కాలనీకి చెందిన డి.సూర్యారావు దీపావళి రోజున గుండెపోటుతో మరణించారు. తన తండ్రి కర్మకాండలు నిర్వహించేందుకు కుమారుడు లలిత్ శుక్రవారం ఉదయం సమీపంలో ఉన్న వంశధార నది వద్దకు చేరుకున్నాడు.
తండ్రి చితి ఆరనేలేదు.. అంతలోనే నదిలో కుమారుడు గల్లంతు - Subalai village is an accident
తండ్రి చితి ఆరనేలేదు.. అంతలోనే కుమారుడు నదిలో గల్లంతయ్యాడు. ఈ విషాదకర ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
Lalit Sagar
కర్మకాండలు నిర్వహిస్తూ నదిలో స్నానం చేసేందుకు దిగగా.. ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. గమనించి స్థానికులు నదిలో దిగి వెతకడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోయింది. తండ్రి చనిపోయిన ఐదు రోజులకే కుమారుడు నదిలో గల్లంతు కావడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లలిత్ సాగర్‌కు భార్య, 9 నెలల కుమార్తె ఉన్నారు.
ఇవీ చదవండి: