Father Throws her Daughter from the Terrace: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలోని ఉదయపూర్ ఎస్సీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫోన్ మాట్లాడుతున్న కుమార్తెను అనుమానంతో మేడ పైనుంచి కిందకి తోసేశాడు ఓ తండ్రి. దీంతో తీవ్ర గాయాలైన ఆ అమ్మాయి.. కోమాలోకి వెళ్లిపోయింది.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలను వెల్లడించారు. ఉన్నవ గ్రామానికి చెందిన కూరాకుల కావ్య గణపవరం సీఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ నెల 8న ఇంటి మేడపై కావ్య సెల్ ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో గమనించిన తండ్రి వరప్రసాద్.. కుమార్తె ఎవరో యువకుడితో మాట్లాడుతుందని అనుమానించి మేడపై నుంచి కిందకు తోసేశాడు.