Father raped daughter: రోజు రోజుకు మహిళలు, బాలికలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంతమందిని అరెస్టు చేసినా ఈ దారుణ ఘటనలు ఆగడం లేదు. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడులో జరిగింది.
Father Raped: అమానవీయ ఘటన.. కూతురిపై తండ్రి అత్యాచారం - తాడేపల్లి అత్యాచారం
Father raped daughter: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిలా మారి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడో మృగాడు. తోడుగా నిలవాల్సిన నాన్నే మద్యం మత్తులో తోడేలులా మారి... కన్నబిడ్డను చిత్రహింసలు పెట్టాడు దుర్మార్గుడు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం.. బతుకు తెరువు కోసం 12 ఏళ్ల క్రితం తాడేపల్లికి వలస వచ్చింది. సీలింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.. ఐదుగురు పిల్లలతో కలసి తాడేపల్లి పట్టాభిరామ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి పూటుగా మద్యం సేవించిన తండ్రి.. తన నాలుగో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంగతి తెలుసుకున్న తల్లి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల కోసం గుంటూరుకు తరలించారు.
ఇదీ చదవండి:profeser sexuval harashment: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. విచారణకు ఆదేశం