తెలంగాణ

telangana

ETV Bharat / crime

కుమార్తె నోట్లో కుంకుమ పోసి.. గొంతు నులిమిన తండ్రి - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. కుమార్తె నోట్లో కుంకుమ పోసి.. అనంతరం గొంతు నులిమి చంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

nellore child
కుమార్తె నోట్లో కుంకుమ పోసి.. గొంతు నులిమిన తండ్రి

By

Published : Jun 15, 2022, 6:23 PM IST

ఆడపిల్లలకు తండ్రి అంటే భరోసా, నమ్మకం. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తన కుమార్తెను రక్షించుకోవడానికి అనుక్షణం పరితపిస్తాడనే ధైర్యం. కానీ ఇక్కడ మతిస్థిమితం లేని ఓ తండ్రి మాత్రం తన కుమార్తెకు ఆపద తలపెట్టాడు. శాంతి పూజల నెపంతో తన కూతురి నోట్లో కుంకుమ పోసి.. అనంతరం గొంతు నులిమాడు.

ఇదీ జరిగింది..

శాంతి పూజల నెపంతో వేణుగోపాల్ అనే వ్యక్తి మూడు సంవత్సరాల వయసున్న తన ఇద్దరు కుమార్తెలను దేవుడి పటాల దగ్గర కూర్చోపెట్టి పూజలు జరిపించాడు. అతడు తన తల్లిని పిలిచి ఒక పాపను ఇచ్చి బయటకు వెళ్లి కూర్చోమన్నాడు. అనంతరం మరో పాప పునర్విక నోట్లో కుంకుమ పోసి గొంతు నుమిలాడు. పాప కేకలతో స్థానికులు వచ్చి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో నెల్లూరుకు తరలించారు. అక్కడి నుంచి చైన్నై ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేణుగోపాల్​ను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details