మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి పంటకు దిగుబడి సరిగ్గా రాక రైతు భూక్యా వెంకన్న(41) అదే పొలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అసలేం జరిగిందంటే...
భూక్యా వెంకన్నకు మూడు ఎకరాల భూమి ఉంది. రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. సుమారు రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు. తామర పురుగుతో పాటు.. అకాల వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతింది. గతంలో మూడు లక్షల రూపాయల అప్పు ఉండగా.. సాగు కోసం చేసిన రెండు లక్షల రూపాయలతో కలిసి... అప్పులు 5 లక్షలకు చేరుకున్నాయి. అప్పులు తీరే మార్గం కనపడక పోవడంతో.. గత కొద్ది కాలంగా మనోవేదనకు గురవుతున్నాడు.