Farmer committed suicide: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భూనిర్వాసితుడు ఒంటెల రాఘవరెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడో టీఎంసీ కాలువ కోసం భూమిని కోల్పోతున్నాడు.
Farmer committed suicide: భూమి పోతుందనే బాధతో ప్రాణం తీసుకున్నాడు
Farmer committed suicide: అన్నదాతలకు భూమంటే ప్రాణం. పొద్దున లేచిన మొదలు ఆ పుడమి తల్లి ఒడిలోనే సేదతీరుతారు. కానీ ఓ రైతు తనకు ఉన్న పంట భూములను కాలువల పేరుతో మూడుసార్లు కోల్పోయారు. చివరికి ఉన్న పొలాన్ని ప్రభుత్వం మరో కాలువ కోసం సేకరించనుండటంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ విషాధ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
పురుగుల మందు తాగి భూనిర్వాసితుడు ఆత్మహత్యాయత్నం
గతంలో ఎస్సారెస్పీ వరద కాలువ, గాయత్రి పంప్ హౌస్ గ్రావిటీ కాలువ, ఎల్లంపల్లి పైపులైన్‌కు చెందిన డీ1 కాలువల్లో మూడు సార్లు పంట భూములను కోల్పోయారు. చివరగా మిగిలిన 20 గుంటలు కొత్త కాలువ కోసం ప్రభుత్వం సేకరించనుండటంతో మనస్తాపం చెందారు. బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అతన్ని కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందారు.
ఇదీ చదవండి:తండ్రి బాటలో తనయుడు.. నాన్న చనిపోయిన చోటే ఉరేసుకుని..