తెలంగాణ

telangana

ETV Bharat / crime

భూమి కోసం పోరాటం.. చివరకు కుటుంబం ఆత్మహత్యాయత్నం - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

Family suicide attempt: తమ భూమి ఆక్రమణకు గురైనా అధికారులు పట్టించుకోవడం లేదంటూ.. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోబోయిన ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. చివ్వెంల మండల ఎమ్మార్వో కార్యాలయం వద్దకు చేరుకున్న బాధిత కుటుంబం తమకు న్యాయం కావలంటూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.

Family suicide
Family suicide

By

Published : Nov 17, 2022, 2:46 PM IST

Family suicide attempt: "తమ భూవిు ఆక్రమణకు గురైందని.. అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు కనీసం పట్టించుకోవడం లేదని" ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. సూర్యాపేట జిల్లా అయిలాపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ బుచ్చమ్మ కుటుంబం తమకు న్యాయం చేయమంటూ చివ్వెంల మండల ఎమ్మార్వో కార్యాలయం దగ్గరకు వచ్చారు.

అధికారులకు తమ భూమి కబ్జా చేశారని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్​ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీనితో చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి బాధితులను సుర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details