ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లిలో జరిగిన దారుణ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కోమాలో ఉన్న చిన్నారుల తల్లికి శుక్రవారం స్పృహ రావడంతో పోలీసులు ఆమెను విచారించారు. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవల కారణంగా... పిల్లలను గొంతునులిమి హత్య చేసినట్లు ఆమె నేరం అంగీకరించింది. తనను కూడా చంపి తన పిల్లల వద్దకు పంపాలని వేడుకుంది.
'భార్యాభర్తల మధ్య గొడవ... చిన్నారుల హత్య' - కడప జిల్లా క్రైం న్యూస్
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లి చిన్నారుల హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కోమాలో ఉన్న తల్లికి స్పృహ రావడంతో పోలీసులు ఆమెను విచారించారు. ఇంట్లో తలెత్తిన గొడవల కారణంగా పిల్లలను గొంతునులిమి హత్య చేసినట్లు ఆమె నేరం అంగీకరించింది.
'భార్యాభర్తల మధ్య గొడవ... చిన్నారుల హత్య'
మరోవైపు చనిపోయిన ముగ్గురు చిన్నారుల మృతదేహాలను చూసేందుకు... గ్రామస్థులు ఆస్పత్రికి తరలివస్తున్నారు. కన్నపేగు తెంచుకుని పుట్టిన బిడ్డలను చంపేందుకు ఆ తల్లికి మనసెలా వచ్చిందంటూ చూసినవారందరూ కన్నీటిపర్యంతమయ్యారు. ముగ్గురు పిల్లల మృతదేహాలకు వైద్యులు శవ పరీక్ష నిర్వహించి, బంధువులకు అప్పగించారు. చిన్నారుల మృతికి కారణమైన తల్లిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
అనుబంధ కథనం :గోరుముద్దలు తినిపించిన చేతులతోనే కన్నబిడ్డలను చంపేసింది..!