fake tea powder: అక్రమంగా నకిలీ టీ పొడి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సూర్యాపేట పోలీసులు. మూడు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించిన పోలీసులు 16 మంది అంతర్రాష్ట ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.22.5 లక్షలు విలువైన 45.5 క్వింటాల నకిలీ టీ పొడిని స్వాధీనం(fake tea powder seized in suryapet) చేసుకున్నారు. ఈ కేసులో మరో 8 మంది పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు. నిందితులను సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మీడియా ముందు హాజరు పరిచారు.
సూర్యాపేట జిల్లాలో నకిలీ టీ పొడి ముఠా గుట్టు రట్టు మూడు బృందాలుగా దాడులు
నిన్న పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన సీసీఎస్, సూర్యాపేట పోలీసులు(suryapet police arrest inter state gang) 3 ప్రత్యేక బృందాలుగా విడిపోయారు. పట్టణంలో ఏకకాలంలో జరిపిన దాడుల్లో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల నుంచి సేకరించిన సమాచారంతో ఏపీలోని రాజమండ్రి , విజయవాడ, రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన నిందితులు నకిలీ టీ పొడి వ్యాపారంలో చేతులు కలిపినట్లు గుర్తించారు.
మూడు చోట్ల ఒకేసారి జరిపిన దాడుల్లో ఏపీలో ఆరుగురు, సూర్యాపేటలో 10 మంది నిందితులు పట్టుబడ్డారు. మొత్తం 24 మందిని గుర్తించిన పోలీసులు 16 మందిని అదుపులోకి(fake tea powder gang arrest) తీసుకున్నారు. నిందితులను పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ రివార్డులు అందించారు. వారి నుంచి 2 రంగు డబ్బాలు, 2 కార్లు, 15 సెల్ ఫోన్లు, వేయింగ్ మిషన్లు, పాత్రలు, గ్యాస్ సిలిండర్ స్వాధీనం చేరుకున్నారు.
కల్తీ టీ పొడిపై అవగాహన కల్పించిన పోలీసులు
కల్తీ టి పొడిని తయారీ(fake tea with chemicals) చేయడానికి అవలంభించే పద్దతిని పోలీసులు ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. నకిలీ టీ పొడి తయారీ.. దాని వల్ల జరిగే దుష్ఫలితాలను ఎస్పీ వివరించారు. నిందితులు మొదటగా వివిద ప్రదేశాల నుంచి ప్రాణాంతక రసాయన రంగుల పొడిని సమీకరిస్తారు. తర్వాత 225 గ్రాముల లెమన్ కలర్ రసాయనిక రంగు, 225 గ్రాముల ఆరెంజ్ రసాయనిక రంగుతో పాటు 50 గ్రాముల చాక్లెట్ రంగును కలిపి మొత్తం ½కేజీ రసాయనిక పొడిని 2 లీటర్ల నీటిలో పోసి అరగంట పాటు మరగబెడతారని వివరించారు. ఈ ద్రావణాన్ని 5 కేజీల టీ పొడికి కలిపిన తరువాత 6 కేజీల రసాయనిక టీ పొడి తయారవుతుందని తెలిపారు. ఇలాంటి రసాయనిక టీ పొడిని 9 కేజీల సాధారణ టీ పొడికి.. 1 కేజీ రసాయనిక టీ పొడి చొప్పున కలిపి కల్తీ టీ పొడిని తయారుచేసి వివిధ రకాల సైజుల ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రితిరాజ్, డీఎస్పీ మోహన్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లాలో నకిలీ టీ పొడి తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠా అరెస్ట్ పట్టుకున్న ఈ టీ పొడి రూ.22.5 లక్షల విలువ ఉంటుంది. మామాలు టీకి ఈ టీ డస్ట్‌కి వందశాతం మార్జిన్ ఉంటది. ఈ టీ డస్ట్‌ను కేరళ నుంచి గానీ లేదా టీ ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో దేనికి పనికిరాని లాస్ట్ గ్రేడ్ టీ పొడిని తీసుకొస్తారు. దాన్ని తీసుకొచ్చి వీటిలో కెమికల్స్ కలుపుతారు. మామూలుగా టీపొడి బాయిలింగ్ వాటర్‌లో వేస్తే దాని కలర్ మారుతుంది. కానీ ఈ టీపొడి మామూలు వాటర్‌లో వేసినా కూడా కలర్ మారిపోతుంది. మీరు ఎక్కడైనా టీ పొడి కొనుగోలు చేస్తే క్వాలిటీ చెక్ చేసుకోవాలి. మామూలు వాటర్‌లో వేసినపుడు రంగు మారితే అది కల్తీ టీ.. బాయిల్డ్ వాటర్‌లో వేసినప్పుడు రంగు మారితే అది ఒరిజినల్ టీపొడి. కల్తీ టీ పొడిని కెమికల్‌తో తయారు చేస్తారు కాబట్టి నీళ్లలో వేసినపుడు వెంటనే రంగు మారుతుంది. ఇందులో టాట్రాజైన్, సన్సోడైల్, కార్బోజైన్ అనే మూడు రకాల కెమికల్స్ కలిపే అవకాశం ఉంటుంది. ఈ కెమికల్స్ ద్వారా అల్సర్, క్యాన్సర్ రోగాల బారిన పడే అవకాశముంది. - రాజేంద్ర ప్రసాద్, సూర్యాపేట జిల్లా ఎస్పీ
ఇదీ చూడండి: