తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2022, 7:59 PM IST

ETV Bharat / crime

బ్యాంకు వేలంలో బంగారం దక్కించుకున్నాడు.. ఆ ఒక్క మాటతో..!

FAKE GOLD: బ్యాంకు వారు బంగారం వేలం వేస్తున్నారంటే ఆశగా వెళ్లాడు. 12 బంగారు గాజులను వేలంలో పాడుకున్నాడు. వాటిని తనకు నచ్చినట్టుగా చేయించుకునేందుకు వర్తకుడి వద్దకు తీసుకెళ్లాడు. వాటిని పరిశీలించిన వర్తకుడు చెప్పిన మాటలతో ఒక్కసారిగా నిశ్చేష్ఠుడయ్యాడు. ఆ వర్తకుడు ఏం చెప్పాడు.. అసలు ఏం జరిగిందంటే..?

బ్యాంకు వేలంలో బంగారం దక్కించుకున్నాడు.. ఆ ఒక్క మాటతో..!
బ్యాంకు వేలంలో బంగారం దక్కించుకున్నాడు.. ఆ ఒక్క మాటతో..!

FAKE GOLD: బ్యాంకు వేలంపాటలో బంగారం దక్కించుకున్న వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. వేలంలో తీసుకున్నది నకిలీ బంగారం అని తెలిసి లబోదిబోమంటున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఏడాది మార్చిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని స్టేట్ బ్యాంక్ శాఖ వేలం పాట నిర్వహించింది. ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన రూపాచారి రూ.6,81,500లకు 12 బంగారు గాజులను వేలంలో పాడుకున్నాడు.

ఆ తర్వాత బంగారాన్ని వర్తకుడి దగ్గరకు తీసుకెళ్లగా.. గాజుల పైపొర మినహా మిగిలినదంతా ఇత్తడి, రాగిగా గుర్తించారు. ఇదే విషయాన్ని బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకుండాపోయిందని రూపాచారి వాపోయాడు. అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.

మార్చి నెలలో మణుగూరులోని స్టేట్ బ్యాంక్ శాఖ నిర్వహించిన వేలంలో మేము 12 బంగారు గాజులను పాడుకున్నాము. తర్వాతి రోజు వాటిని వర్తకుడి దగ్గరకు తీసుకెళ్లి కరిగిస్తే.. గాజుల పైపొర మినహా మిగిలినదంతా ఇత్తడి, రాగిగా తేలింది. వెంటనే బ్రాంచి మేనేజరుకి ఫిర్యాదు చేస్తే.. పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నా.-రూపాచారి, బాధితుడు

ABOUT THE AUTHOR

...view details