పోలీస్స్టేషన్ ఆవరణలో భారీ పేలుడు.. అసలు ఏమైందంటే? - జిలెటిన్ స్టిక్స్
EXPLOSION AT POLICE STATION : చిత్తూరు జిల్లాలోని ఓ పోలీస్స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. గతంలో పట్టుకున్న జిలెటిన్ స్టిక్స్ పేలినట్లు సమాచారం.
08:35 October 08
పోలీస్స్టేషన్ ఆవరణలో భారీ పేలుడు
EXPLOSION AT POLICE STATION : ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ పేలుడు సంభవించింది. పోలీసు స్టేషన్ ఆవరణలో తెల్లవారుజామున భారీ శబ్ధంతో పేలుడు జరగడంతో.. విధుల్లో ఉన్న ఏఎస్ఐ ఆంజనేయులు రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ధాటికి అద్దాలు పగిలి గాజు పెంకులు చెల్లాచెదురయ్యాయి. గతంలో పట్టుకున్న జిలెటిన్ స్టిక్స్ పేలినట్లు సమాచారం. తెల్లవారుజామున భారీ శబ్ధంతో పరిసర ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు.
ఇవీ చదవండి: