భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ పంచాయతీ బత్తులనగర్ కాలనీకి చెందిన ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. ఆమెకు అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల మాజీ జడ్పీటీసీ, మల్లయ్య మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు గాంధీ ముందుకొచ్చి దహనసంస్కారాలు నిర్వహించారు. మృతదేహాన్ని పార్శిల్ చేసి ఆటోలో తీసుకొళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.
Funeral: కరోనా మృతురాలికి మాజీ జడ్పీటీసీ అంత్యక్రియలు - corona deaths in bhadradri kothagudem district
కరోనాతో మృతి చెందిన మహిళ అంత్యక్రియలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడం వల్ల మాజీ జడ్పీటీసీ చొరవ చూపి దహన సంస్కారాలు చేశారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ పంచాయతీలో చోటుచేసుకుంది.
కరోనా మృతురాలికి అంత్యక్రియలు, భద్రాద్రి జిల్లాలో కరోనా మరణాలు
కరోనా వంటి కష్టకాలంలో.. మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని.. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అలాంటి వారికి అంతిమ వీడ్కోలు పలుకుతున్నామని గాంధీ తెలిపారు.