తెలంగాణ

telangana

ETV Bharat / crime

Peacocks Died in Warangal : పర్వతగిరిలో విషాదం.. 8 నెమళ్లు మృత్యువాత - పర్వతగిరిలో 8 నెమళ్లు మృతి

Peacocks Died in Warangal : వరంగల్ జిల్లాలో 8 నెమళ్లు మృత్యువాత పడ్డాయి. పర్వతగిరి మండల శివారు దేవిలాల్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంటలకు పిచికారీ చేసిన క్రిమిసంహారక మందుల వల్లే నెమళ్లు మరణించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Peacocks Died in Warangal
Peacocks Died in Warangal

By

Published : Jan 29, 2022, 9:24 AM IST

Peacocks Died in Warangal : వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పర్వతగిరి మండల శివారు దేవిలాల్ తండాలో ఎనిమిది నెమళ్లు మృత్యువాత పడటం కలకలం రేపింది. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పర్వతగిరిలో 8 నెమళ్లు మృత్యువాత

Peacocks Died in Parvathagiri :నెమళ్లు మృతి చెందడం గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మృతి చెందిన నెమళ్లను చూసి.. పంటలకు పిచికారీ చేసిన క్రిమి సంహారక మందులే వాటి మరణానికి కారణంగా ప్రాథమికంగా గుర్తించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details