తెలంగాణ

telangana

ETV Bharat / crime

కార్వి ఎండీ పార్థసారథిని అరెస్టు చేసిన ఈడీ

Karvy
Karvy

By

Published : Jan 24, 2022, 11:13 AM IST

Updated : Jan 24, 2022, 12:00 PM IST

11:12 January 24

కార్వి ఎండీ పార్థసారథిని అరెస్టు చేసిన ఈడీ

karvy chairman arrested : కార్వి సంస్థ ఎండీ పార్థసారథిని ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట కార్వి సంస్థ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. సీసీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పార్థసారథిపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట భారీ మోసాలకు కార్వి సంస్థ పాల్పడింది.

karvy chairman parthasarathy scams: మదుపరుల షేర్లు తమవేనంటూ కార్పొరేటు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని మోసం చేసిన.. కార్వి స్టాక్‌బ్రోకింగ్‌ అక్రమాలపై సీసీఎస్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కార్వి స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థ రూ.3,520 కోట్లు స్వాహా చేసిందని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్లలో ఈ మోసాలు చేశారని సాక్ష్యాధారాలు సేకరించారు. వీటికి సంబంధించిన వివరాలను సెబీ, ఎన్​ఎస్​ఈ, ఇన్‌కమ్​ టాక్స్, ఆర్బీఐ, ఆర్వోసీ కార్యాలయాల నుంచి వివరాలు తీసుకున్నారు.

షేర్లు తమవే అంటూ..

Karvy Scam update: కార్వి సంస్థలోని 2 లక్షల మంది షేర్లు తమవే అంటూ ఇండస్‌ ఇండ్‌, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుల నుంచి పార్థసారథి 8ఏళ్ల క్రితం వేర్వేరుగా రుణాలు తీసుకున్నారు. మదుపరుల ఖాతాల్లోని రూ.720 కోట్లను కార్వి రియాల్టీ, సోలార్‌ పవర్ కంపెనీలకు మళ్లించారు. రెండేళ్ల క్రితం కొందరు వినియోగదారులు ఈ విషయాన్ని సెబీకి ఫిర్యాదు చేయగా... కార్వి స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థ ట్రేడింగ్‌పై నిషేధం విధించింది. అప్పటి నుంచి కార్వి సీఎండీ పార్థసారథి రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల ప్రతినిధులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మదుపరుల షేర్లను తనఖా ఉంచి రుణాలు

మదుపరుల షేర్లు తనఖా ఉంచి, బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న కార్వి సంస్థ ఛైర్మన్‌ పార్థసారథి.. వాటిని సొంతానికి వినియోగించుకునేందుకు కార్వి వెల్త్, రియాల్టీ సంస్థలకు మళ్లించాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.2800 కోట్ల రుణాన్ని వేర్వేరు సంస్థలకు మళ్లించేందుకు 20 డొల్ల కంపెనీలను ప్రారంభించాడు. అన్ని కంపెనీలకు నష్టాలు వచ్చాయంటూ బ్యాలెన్స్‌ షీట్లలో చూపించారు. ఈ డొల్ల కంపెనీల కార్యకలాపాలను పర్యవేక్షించిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు వృత్తి నిపుణులు, వ్యాపారులు మదుపు చేసిన రూ.55 కోట్లనూ కార్వి సంస్థ సొంతానికి వినియోగించుకుందని దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో ఇప్పటి వరకూ 120 మంది సాక్షులను విచారించారు. వేల సంఖ్యలో పత్రాలు, కార్వి స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థలో కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 24, 2022, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details