తెలంగాణ

telangana

ETV Bharat / crime

చిక్కుల్లో బండి సంజయ్ కుమారుడు..! తోటి విద్యార్థిని కొట్టినందుకు కేసు నమోదు - case against bandi sanjay son for abusing student

Police Case Against Bandi Sanjay Son: బండి సంజయ్ కుమారుడు భగీరథపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన తోటి విద్యార్థిని భగీరథ కొట్టాడని.. మహీంద్రా వర్సిటీ క్రమశిక్షణ సంఘం ఫిర్యాదు మేరకు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది

Dundigal Police Station
Dundigal Police Station

By

Published : Jan 17, 2023, 9:28 PM IST

Police Case Against Bandi Sanjay Son: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమారుడు భగీరథపై దుండిగల్‌ పోలీస్​స్టేషన్‌లో కేసు నమోదైంది. మహీంద్రా వర్సిటీకి చెందిన విద్యార్థిపై బండి భగీరథ దాడి చేసినట్టు విశ్వ విద్యాలయ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కళాశాల ప్రాంగణంలోనే ఈ దాడి జరిగిందని, కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా దుండిగల్ పోలీసులు బండి భగీరథ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బండి భగీరథ మహేంద్ర విశ్వవిద్యాలయంలో మేనేజ్ మెంట్ కోర్సు చదువుతున్నారు. శ్రీరామ్ అనే విద్యార్థిని దూషిస్తూ దాడి చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ క్రమంలోనే బాధిత విద్యార్థి వీడియో సైతం బయటికి వచ్చింది. బండి భగీరథ స్నేహితుడి చెల్లెల్ని వేధించినందుకే భగీరథ తనపై దాడి చేశాడని... ఇందులో అతని తప్పేమీ లేదని శ్రీరామ్ వీడియోలో పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details