Rape on dumb women: ఓ బధిర మహిళను బంధించి అత్యాచారం చేశారనే ఫిర్యాదుపై.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన పోలీసులు.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో విచారణ జరుపుతున్నారు. సాంకేతిక ఆధారాలతో ఆదివారం పలుచోట్ల కూపీ లాగినట్లు సమాచారం. మచిలీపట్నానికి చెందిన వంట కార్మికురాలు (37) ఫిబ్రవరి 4న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మహిళ కుటుంబసభ్యులు మరునాడు స్థానిక ఇనుగుదురుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. మార్చి 9న బాధితురాలి కుటుంబీకులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, తాను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నానని, ఓ మహిళ ఇక్కడ ఉందని తెలిపాడు. ఆ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు కరీంనగర్‌కు వచ్చి బాధితురాలిని తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మాటలు రాకపోవడంతో ఏం జరిగిందన్నది ఆమె చెప్పలేకపోయింది.
రెండోసారి ఫిర్యాదుతో విచారణ