తెలంగాణ

telangana

ETV Bharat / crime

Dog kidnap: నిజామాబాద్​లో కుక్క అపహరణ.. పీఎస్​లో ఫిర్యాదు

ఎవరైనా ఎత్తుకెళ్తే మనుషులనో, డబ్బునో, బంగారమో ఎత్తుకెళ్లాలి కాని ఓ వ్యక్తి కుక్కను ఎత్తుకెళ్లాడు. తమ కుక్క కిడ్నాప్​కు​ గురైందని యజమాని ఫిర్యాదుతో చేయగా​ విషయం బయటకు వచ్చింది. ఇంతకు ఇది ఎక్కడ జరిగిందో చూద్దాం పదండి.

dog, kidnap
కుక్క, కిడ్నాప్​

By

Published : Jul 1, 2021, 7:36 PM IST

కిడ్నాప్​ అంటే ఎవరు ఎవరిని ఎత్తుకెళ్లారో తెలుసుకోవాలనిపిస్తుంది. అయితే ఇక్కడ మనుషిని కిడ్నాప్​ చేయలేదు కాని కుక్కను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్​లో జరిగింది. నగరంలోని వీక్లీ మార్కెట్​కు​ చెందిన శ్రావణ్ ఏడాది క్రితం (లాబ్ జాతి) కుక్కను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ కుక్కను పెంచుకుంటున్నారు. దీని కోసం రోజూ రూ.200 ఖర్చు చేసేవారు. మంగళవారం సాయంత్రం ఇంటి ఆవరణలోకి వచ్చిన ఓ దుండగుడు దాన్ని అపహరించుకెళ్లాడు. కాసేపటికి గుర్తించిన యజమాని అంతటా గాలించినా ఆచూకీ లభించలేదు.

సీసీటీవీ ఫుటేజ్​ పరిశీలించగా.. ఓ వ్యక్తి తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈమేరకు ఒకటో ఠాణాలో శునకాన్ని కిడ్నాప్​ చేసినట్లు యజమాని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కుక్క కనిపించట్లేదన్న బెంగతో తన కూతురు రెండ్రోజులుగా ఏడుస్తూ భోజనం చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు శ్రావణ్​. ఎవరికైనా శునకం గురించి తెలిస్తే తమకు, లేదా వన్​టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

dog kidnap: కుక్క పోషణకు నెలకు రూ.6 వేల ఖర్చు

ఇదీ చదవండి:డ్రోన్ల ముప్పుపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details