మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వైద్యం కోసం వచ్చిన ఓ బాలికపై వైద్యుడే అత్యాచారం చేయబోయాడు. ఈ ఘటన సోమవారం జరగగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సుచిత్ర ప్రాంతానికి చెందిన ఓ బాలిక(16)కు జ్వరం వచ్చింది. మాత్రలు వేసినా జ్వరం తగ్గకపోవడంతో... తల్లి స్థానికంగా ఉన్న ఓ పీఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లింది. చెకప్ పేరిట బాలికను ఒక్కదాన్నే లోపలకు తీసుకెళ్లాడు. కాసేపటికి తల్లిని మాత్రల కోసమని బయటకు పంపాడు. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఏడ్చుకుంటూ బయటకు పరుగెత్తుకు రావడంతో... ఆమె తల్లి గమనించింది. ఏమైందంటూ కూతురిని ఆరా తీయగా... అసలు విషయం బయటపడింది.
బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు ఇచ్చింది. ఆమె కూతురును జ్వరమొచ్చిందని చెప్పేసి జీడిమెట్లలోని ఓ ప్రైవేటు క్లినిక్‌కు తీసుకువెళ్లింది. అక్కడ డాక్టర్ మెడిసిన్ తెమ్మని తల్లిని మెడికల్ షాప్‌కి పంపాడు. పాప పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పాప ఆ విషయం చెప్పడంతోనే... తల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం.