హోలీ పండుగ.. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో విషాదం నింపింది. మోతీ ఘనపూర్లో.. చెరువులో ఈతకు వెళ్లిన రామయ్య (45) నీటమునిగి మృతి చెందాడు. సంబురాల అనంతరం.. చెరువులోకి దిగిన రామయ్య, ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యాడు.
హోలీ వేడుకల్లో అపశృతి.. చెరువులో గల్లంతై వ్యక్తి మృతి - చెరువులో గల్లంతై వ్యక్తి మృతి
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో.. హోలీ పండుగ వేళ అపశృతి చోటుచేసుకుంది. మోతీ ఘనపూర్లో.. చెరువులో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు.
చెరువులో గల్లంతై వ్యక్తి మృతి
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదం.. తీసింది నెమలి ప్రాణం