తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు - telangana news upates
13:03 June 16
నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు
తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో నామాతో పాటు మధుకాన్ కేసులో నిందితులందరికీ ఈడీ తాఖీదులు పంపింది.
మధుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఖాతాలు, హార్డ్‌డిస్క్‌లను విశ్లేషిస్తున్న ఈడీ బృందాలు.. విచారణకు హాజరుకావాలని నామాకు సమన్లు పంపింది.